Loading the player...

Yadadri jilla lo skylab reddy paryatana

  • యదాద్రి జిల్లాలో పర్యటించిన స్కైలాబ్ రెడ్డి....
    యదాద్రి జిల్లాలో స్కైలాబ్ రెడ్డి స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్ధాపకులు కందాడి స్కైలాబ్ రెడ్డి శనివారంనాడు పర్యటించి పలు పూజా కార్యక్రమాలో పాల్గొన్నారు.బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామం శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న యజ్ఞం, అగ్ని గుండాల కార్యక్రమంకు విచ్చేసిన స్కీలాబ్ రెడ్డి ఆలయ చైర్మన్ వీరారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని స్వామివారి పూజాకార్యక్రమంలో స్వామివారి ఆశీర్వచనం చేసిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు స్కైలాబ్ రెడ్డిని వేద మంత్రాల మధ్య ఆశీర్వచనం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా స్కైలాబ్ రెడ్డి మాట్లాడుతూ యదాద్రి జిల్లా పుణ్యక్షేత్రంలకు పుట్టినిలు లాంటిదని పేర్కొన్నారు. లింగ బసవేశ్వర స్వామి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగయ్య, ఉప సర్పంచ్ మహిపాల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు యాదిరెడ్డి, కృష్ణ, భిక్షపతి, రవి, ఆంజనేయులు, విజయ లతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    Category : ALLONE

    #yadadri#jilla#lo#skylab#reddy#paryatana

    0 Comments and 0 replies
arrow_drop_up