Loading the player...

కథ - స్కైలాబ్(Skylab) , రచయిత - యెన్నం ఉపేందర్(YennamUpendar) , Kadhaaveechikalu-కథావీచికలు

  • యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవిగా అందరికీ సుపరిచితుడే. ʹకర్రు పుట్టింది ʹ కవితా సంపుటి (2001 ), ʹఎండమావి ʹకథా సంపుటి (2003), ʹ నారుమడి ʹ కవితా సంపుటి (2010 ), ʹకొన్ని వెలుగు నీడలు ʹ కథా సంపుటి వీరి రచనలు.
    స్థల కాలాలతో ప్రమేయం లేకుండా అనాదిగా ,సర్వత్రా మానవుడి దుఃఖ బాష ఒక్కటే. దళితుడి,పేదవాడి,సామాన్యుడి గొంతు, గుండె ఒక్కటే.మనిషి గురించి,మన పల్లెటూర్ల గురించి,మనిషి అస్తిత్వం, ఆకలి,పోరాటాల గురించిన తపన ఎక్కడైనా ఒక్కటే. మానవీయత కోసం,మానవీయ విలువలకోసం రచయితలు,కవుల తపనలే వారి రచనలు.
    నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం గుమ్మదవెల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ ఆనవాళ్ళు ఇంకా ఆ పల్లెటూరిలోనే సజీవంగా వున్నాయనడానికి సక్షమే అతడి తడి కవిత్వం.మైనింగ్ ఇంజనీర్ లో బంగారు పతకం,ఇండియన్ పోస్టల్ సర్వీసు ఉద్యోగం సాధించినా,వీటన్నిటిని మించి జనజీవన పోరాటాలను,సామాజిక సoఘర్షణలను కథలుగా కవితలుగా సజీవ దృశ్యాలుగా నిలపడంలోని శ్రద్ధ, ఆసక్తి వీరికి సాహిత్యం పట్ల గల మక్కువను తెలియ చేస్తాయి.
    భార్య కలల్ని గుర్తు పట్టగలిగినవాడు,పిల్లల్ని అమ్మగా,నాన్నగా భావించే సహృదయత కలిగినవాడు కాబట్టే అతడి కవిత్వం లో మనిషి తనపు ఆనవాళ్ళు అడుగడుగునా కనిపిస్తాయి, కదిలిస్తాయి.
    ʹకాలం కాని కాలమిది/ సమయమెరుగని గూబల కాలం/తెగి పడిన ఊర పిచుకలు/ఊరొక గర్భస్త పిండం/పొద్దునెవరో మింగారు/ఆడబిడ్డ అనుకున్నారేమో ʹ ( నెత్తురు బొమ్మ )
    ʹ పల్లె ఒడ్డు లాంటిది/పడవ ఓ రైతు కూలి/ సముద్రం నేటి పట్నం /ఆకాశం ఓ కొయ్య గుర్రం / సముద్రం ఓ మైదానం / వెరసి ఓ పునరుక్తి ఎలిజీ ʹ ( కవలలు )
    ʹ అమ్మా కల్లోలిత ప్రాంతమిది/ కూలిన తాటాకుల గుడిసెల మధ్య/నిన్నటి తాటి చెట్టులా నిలబడలేనుʹ ( అమ్మా ఆకలి )
    ʹ ఎన్ని కులాలో ఈ దేశాన /ఆకలిది ఒకే కులం /ఆకలి కావడమే దురదృష్టం /ఆకలి ఓ కనిపించని నిప్పు ʹ( ఊరు మాట్లాడింది )
    సూటిదనం స్పష్టత సాధారణ పదాలు ,వ్యావహారిక బాష, క్లుప్తత వీరి కవిత్వానికి బలాన్ని అందాన్ని చేకూర్చాయి.పాఠకులకు సందేశాలు ఇవ్వకుండా, సందేహాలు కలిగించకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సరళంగా,సూటిగా చెప్పడాన్ని ఈ కవిత్వం లో గమనించవచ్చు.
    చిద్రమైపోతున్న పల్లెటూర్లు , విధ్వంసం అవుతున్న నగరాలూ,సాంస్కృతిక పతనం,మాయమవుతున్న విలువలు,మానవ సంబంధాలు,సగటు మనిషి తాలూకు అవస్థలు,ఆదుర్దాలు, ఆశలు,సంఘర్షణలు , పల్లెటూరి ఆనవాళ్ళు,మమకారాలు,మంచితనాలు,మానవీయతను పరిరక్షించుకోవాలనే తపనలు , అనుబంధాలకు ప్రాధాన్యతలు ఈ కవితల నిండా వున్నాయి.
    సామాజిక శాస్త్రాల అధ్యనం,సమాజ పరిశీలన, సమాజ పతనం వెనుక కొనసాగే కుట్రలు,పట్టణీకరణ ప్రభావాలు , కాలం తెస్తున్న మార్పులకు సంబందించిన అవగాహనలు ఈ కవిత్వాన్ని బాగా పదును తేల్చాయి.
    ʹ నిన్నటి పల్లె గురుతులు/ వాడని వాసనల మల్లెలు/నేటి పట్న వాసనలు/ చెరిపినా చెరగని కిల్లీ మరకలు ʹ( మల్లెలు-మరకలు )అంటున్నా ,ʹ ఒక్కో ఓటు ఒక్కో తాళపు చెవి/అతడు అంగ వస్రాన్ని మిగులుస్తాడు/అయినా అతడు మనలో ఒకడు/ఇపుడు రాజకీయం ఓ ప్యూడల్ తత్త్వం/ సమస్త వృత్తుల బహుజనుల్లారా / రాజ్యమేలేదేప్పుడో?ʹ ( రహదారి ) అంటున్నా, కవి తన సొంత గొంతుతోనే మాట్లాడుతున్నాడని ప్రజా పక్షమే వహిస్తున్నాడని తెలుస్తుoది.
    మనిషిని మనిషిల చూడటానికి,గుర్తించడానికి , గౌరవించడానికి సామాజిక వైషమ్యాలను బద్దలు కొట్టక తప్పదు.ప్రశ్నించే తత్త్వం తో బాటూ, పరిశోదించే ప్రజ్ఞ కూడా ఈ కాలపు కవికి అవసరం.సత్య దృష్టి, అంతర దృష్టి వున్నాయి కాబట్టే ఈ కవిత్వం లోని సజీవత ,స్వచ్ఛత చదువరులను వెంటాడుతాయి.
    ʹ భూమి విశాలమే కావచ్చు/ నా కేరాఫ్ మా ఊరేʹ( కేరాఫ్ ) అనడం లోనే కవి తత్త్వం తెలుస్తోంది.
    వ్యక్తిగత అనుభవం లోంచి పుట్టినా కవితా ఎలా సామాజిక కోణాన్ని సంతరించుకుందో చెప్పటానికీ వాళ్ళ నాన్న గురించిన భావ వ్యక్తీకరణ ఇలా వుంటుంది. కేవలం జ్ఞాపకం లేదా అనుభూతికే పరిమితం కాకుండా ʹ రాజ్యం సరళీకరంచబడింది కదా/ఉచ్చు బాగా బిగిసింది/పొగ రింగులా ఎగిరిపోయిన నాయినా/ నా ముఖం లో కూడా నువ్వు కనిపిస్తావా?/ గ్లోబల్ ముఖాన్ని భరించలేకున్నాను. ʹ ( పొగ రింగు )అనడం లోనే కవి తాత్వికత తెలుస్తోంది.
    దశాబ్ది కవిత్వం ( 2001-2010 ) కవితా సంకలనం లోని ఉపేందర్ రాసిన ʹ ఆదివాసీ సంగీతం ʹకవిత అతడి సాహిత్య వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తుంది
    ʹ ఇప్పుడిక అడవి వంతు/ అడవి కరెన్సీ గుట్టల్లా కనపడుతోంది./చింత పండు,తేనే,కుంకుడు కాయల దోపిడీతో మొదలు/బాక్సైట్,బొగ్గు,ఐరన్ వోర్ దోపిడీకీ తెర లేచింది/అడవి గర్భాన ఉబికిన చెలమ బాట/ఆదివాసి తెగ ఆరిపోబోతున్న ఆనవాలు/చీమల పుట్టల్లోకి పాముల చొరబాటు ʹ అంటూ ఆ కవితను ఇలా ముగిస్తాడు.
    ʹ అడవి కొత్త పాఠం పాటగా చెప్పింది/మూలాల్ని మట్టుపెట్టే మర్మాన్ని విప్పమంది/మైదాన మృగాల్ని ఎదుర్కోమన్నది/ఓ ఆదివాసీఅడవి సంగీతాన్నికనుక్కోమన్నది. ʹ
    ఆకలి విలువ, అన్నం విలువ ,మనిషి విలువ ,ప్రాణం విలువ తెలిసిన కవుల కవిత్వం మళ్ళీ మళ్ళీ చదువుకోవడం వల్ల జీవితం లోని సాంద్రత, కవిత్వo లోని ఘాడత మరోసారి అనుభవం లోకి వస్తాయనుకుంటాను.

    Category : ALLONE

    #కథ#స్కైలాబ్#skylab#రచయిత#యెన్నం#nbsp#ఉపేందర్#yennamupendar#kadhaaveechikalu#కథావీచికలు

    0 Comments and 0 replies
arrow_drop_up